Asaduddin Owaisi: ఈ అల్లర్లు మతపరమైనవి కావు.. పథకం ప్రకారం జరుగుతున్నాయి: అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi alleged BJP behind the Delhi violence
  • అల్లర్ల వెనక బీజేపీ హస్తం ఉంది
  • బీజేపీ మాజీ ఎమ్మెల్యే డీసీపీ పక్కన నిలబడి ఆదేశాలిచ్చారు
  • పోలీసులు తమ విధులను పక్కన పెట్టేసి గుంపుతో కలిసి అరాచకం
ఢిల్లీలో నిన్న జరిగిన హింసాత్మక ఘటనలపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దారుస్సలాంలో నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవి మతపరమైన అల్లర్లు కావని, పథకం ప్రకారం జరుగుతున్నవని ఆరోపించారు. ఢిల్లీలోని హింసాత్మక ఘటనల వెనక బీజేపీ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ కనుసన్నల్లోనే అల్లర్లు జరిగాయన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు డీసీపీ పక్కన నిలబడి వారికి ఆదేశాలిచ్చారని, ఇదే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పోలీసులు తమ విధులను పక్కన పెట్టేసి గుంపులతో కలిసి అరాచకం సృష్టిస్తున్నారని అసదుద్దీన్ ఆరోపించారు.
Asaduddin Owaisi
Delhi violence
BJP

More Telugu News