జామియా అల్లర్ల ట్వీట్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎంకు క్లీన్చిట్
- పోలీసులే బస్సులు తగులబెట్టారని ఆరోపించిన సిసోడియా
- కేసు నమోదు చేసిన పోలీసులు
- మనీశ్ తప్పు చేయలేదని విచారణలో వెల్లడి
దక్షిణ ఢిల్లీలో డిసెంబర్‌లో జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో ఆందోళనకారులు ఢిల్లీ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన మూడు బస్సులను తగులబెట్టారు. ఆ సమయంలో కొంత మంది పోలీసులు బస్సులపై కొన్ని ద్రవాలు చల్లుతున్నట్టు ఫొటోలు బయటికి వచ్చాయి. దాంతో, బస్సులకు పోలీసులే నిప్పుపెట్టారని సిసోడియా ట్వీట్ చేశారు. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులపై నింద మోపిన మనీశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ్ కోర్టును ఆశ్రయించారు. దాంతో, ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే, తాను తప్పు చేయలేదని విచారణలో తేలడంతో సిసోడియాకు ఉపశమనం లభించింది.