Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై బాలీవుడ్​ నటి పొగడ్తల వర్షం

Vijay Deverakonda is kind says Ananya Panday
  • మంచోడు, స్మార్ట్, బాగా మాట్లాడుతాడని అనన్య పాండే కితాబు
  • ఫైటర్ సినిమాలో విజయ్‌తో జోడీ కట్టిన యువ నటి
  • పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న పూరీ జగన్నాథ్
అర్జున్ రెడ్డితో ఓవర్‌‌నైట్ స్టార్‌‌డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ చిత్రం తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది.

ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇటీవలే విజయ్, అనన్య వర్కింగ్ స్టిల్ట్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన అనన్య...తాజాగా హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించింది. విజయ్ చాలా మంచి వ్యక్తి అని, స్మార్ట్ అని అభిప్రాయపడింది.

ఇక, అర్జున్‌ రెడ్డిలో విజయ్ క్యారెక్టరైజేషన్ దృష్యా ఆ చిత్రాన్ని ఇప్పటికీ వివాదాస్పద చిత్రంగా భావిస్తున్నారు. ఈ విషయం గురించి తాను విజయ్‌తో చర్చించలేదని అనన్య చెబుతోంది. అర్జున్ రెడ్డిలో దేవరకొండ బాగా నటించాడని కితాబిచ్చింది. అయితే, సినిమాలో అలాంటి పాత్ర పోషించినంత మాత్రాన నిజ జీవితంలోనూ మనుషులు అలాగే ఉంటారని అనుకోవడం పొరపాటు అని చెప్పింది. ఈ క్రమంలో విజయ్‌పై బాలీవుడ్ యువ నటి పొగడ్తల వర్షం కురిపించింది. ‘విజయ్ మంచి వ్యక్తి. స్మార్ట్. బాగా మాట్లాడుతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి’ అని చెప్పుకొచ్చింది.
Vijay Devarakonda
ananya pandey
fighter
movie
Puri Jagannadh
Bollywood

More Telugu News