Sonia Gandhi: ఢిల్లీలో హింసాత్మక ఘటనలపై సోనియా ఆవేదన

Sonia responds anti CAA violence
  • ఢిల్లీలో పెచ్చరిల్లిన సీఏఏ వ్యతిరేక అల్లర్లు
  • హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మృతి
  • మతం పేరుతో విడదీసే వారిని ఉపేక్షించరాదన్న సోనియా
ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనలు తీవ్రరూపు దాల్చిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన హింసాత్మక ఘటనల్లో రతన్ లాల్ అనే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీసే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. మహాత్ముడు జన్మించిన దేశంలో హింసకు తావులేదని, ప్రస్తుత సంఘటనలు బాధాకరమని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు మత సామరస్యాన్ని కొనసాగించాల్సిన తరుణమని పేర్కొన్నారు.
Sonia Gandhi
CAA
Delhi
Police

More Telugu News