Rekha: తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను: 'ఆనందం' హీరోయిన్ రేఖ

Anandam Movie
  • మొదటి నుంచి నాకు గైడెన్స్ లేదు 
  • డేట్లు సర్దుబాటు చేయలేకపోయాను
  • కొన్ని అవకాశాలు కోల్పోయానన్న రేఖ
తెలుగు తెరకి 'ఆనందం' సినిమాతో పరిచయమైన రేఖ, ఆ తరువాత కొన్ని సినిమాల్లో కనిపించింది. అయితే అవేవీ ఆమె కెరియర్ కి అంతగా హెల్ప్ కాలేదు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. "అప్పట్లో నేను కన్నడ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయడం వలన, తెలుగు .. తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయాను. కన్నడలో బిజీగా ఉండటం వలన తెలుగు .. తమిళ భాషల నుంచి వచ్చిన మంచి అవకాశాలను వదులుకున్నాను.

 మణిరత్నం గారి సినిమాను కూడా అలాగే వదులుకున్నాను. సరైన గైడెన్స్ లేకపోవడం వలన, నేను కొన్ని అవకాశాలను కోల్పోయాను. డేట్స్ సర్దుబాటు చేయడం రాకపోవడం మరో కారణమని చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకూ ముంబైలో వున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ కి మకాం మార్చేశాను. ఇకపై నేను హైదరాబాదులోనే వుంటాను .. తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు తగిన పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా వున్నాను" అని చెప్పుకొచ్చింది.
Rekha
Aanadam Movie
Tollywood

More Telugu News