Nara Lokesh: వేల ఎకరాల మీ అక్రమ ఎస్టేట్లు, ప్యాలెస్ లు ఇవ్వండి... లక్షల మంది పేదలకు ఇళ్లు వస్తాయి: నారా లోకేశ్

Nara Lokesh questions AP government over land distribution
  • ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ
  • వివాదాస్పదంగా మారిన భూసేకరణ అంశం
  • పేదలకు పంచేందుకు పేదల భూములు లాక్కోవడం ఏంటని ప్రశ్నించిన లోకేశ్
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న భూసేకరణ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. పేదవాళ్లకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కుని తిరిగి పేదలకు పంచుతాననడం జగన్ రివర్స్ టెండరింగ్ కు పరాకాష్ఠ అని విమర్శించారు. పథకాల పేరు మార్పు కోసం పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. "వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండి... లక్షల మంది పేదలకు ఇళ్లు వస్తాయి" అంటూ వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Lands
Distribution
YSRCP
Andhra Pradesh

More Telugu News