55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్​ విడుదల

25-02-2020 Tue 10:13
  • మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
  • నామినేషన్ల స్వీకరణకు  తుదిగడువు 13, ఉపసంహరణకు 18
  • నామినేషన్ల పరిశీలన 16న..పోలింగ్ 26న  
For 55 Rajya Sabha seats Election Schedule releases

రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 55 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు  తుదిగడువు మార్చి 13 , నామినేషన్ల పరిశీలన 16న, ఉపసంహరణకు తుదిగడువు 18వ తేదీగా ఈసీ పేర్కొంది. మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.