KCR: నేడు ట్రంప్​ కు రాష్ట్రపతి ప్రత్యేక విందు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్​

  • రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక విందుకు ఏర్పాట్లు
  • ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న కేసీఆర్
  • ట్రంప్ దంపతులకు కానుకలు అందజేయనున్న సీఎం
Telangana CM Kcr goes to Delhi to partcipate Rastrapati special Dinner

భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఈరోజు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందుకు కేంద్ర మంత్రులు, రాజకీయనేతలు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.

ఈ ఆహ్వానం మేరకు విందులో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారని సమాచారం. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు, కూతురు ఇవాంకకు కేసీఆర్ కానుకలు అందించనున్నట్టు సమాచారం. కాగా, రాష్ట్రపతి గౌరవార్థం ఇస్తున్న ఈ విందులో మొత్తం 90 నుంచి 95 మంది వీఐపీలు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. కేసీఆర్ సహా మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, అసోం, హర్యానా, బీహార్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

More Telugu News