Gorantla Butchaiah Chowdary: నిమ్మగడ్డ నోరు విప్పితే జగన్‌కు.. విప్పకపోతే ఆయనకు ముప్పు: గోరంట్ల

TDP MLA Goranta reveal the situation of Nimmagadda prasad
  • ఆయన పరిస్థితి దయనీయంగా ఉంది
  • నోరు విప్పకుంటే ఉరికంబం ఎక్కుతాడు
  • జగన్ విధానాలతో రాష్ట్రం దివాలా

నిమ్మగడ్డ ప్రసాద్ నోరు విప్పినా, విప్పకపోయినా ముప్పేనని టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. నిమ్మగడ్డ ప్రసాద్ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఆయన నోరు విప్పితే ఏపీ సీఎం జగన్ జైలుకు వెళ్తారని, విప్పకపోతే ఆయనే ఉరికంబం ఎక్కుతాడని అన్నారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రం దివాలా అంచున నిలిచిందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గన మైనింగ్ వ్యవహారం విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News