Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • కేరెక్టర్ల ఎంపిక గురించి సాయిపల్లవి
  • రామ్ చరణ్ కొత్త ప్రాజక్ట్ 
  • విశాల్ కి, దర్శకుడికి భేదాభిప్రాయాలు
Sai Pallavi says she must be identified in the charecter

 *  'నాకు ఏమాత్రం సూట్ అవ్వని పాత్రలు నేను చేయలేను' అంటోంది అందాలతార సాయిపల్లవి. 'ఒక పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. నాతో నేను పోల్చుకోగలగాలి. అప్పుడే ఆ సినిమా నేను చేస్తాను. అలా చేయలేనివి చాలా వదిలేశాను' అని చెప్పింది సాయిపల్లవి.
*  గతంలో పలు హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు విక్రంకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చరణ్ కు ఆయన ఓ కథ చెప్పాడనీ, అది బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్టు తయారుచేయమని చరణ్ చెప్పాడని అంటున్నారు.
*  తమిళ చిత్ర కథానాయకుడు విశాల్ నటిస్తున్న 'తుప్పారివాలన్' సీక్వెల్ నుంచి దర్శకుడు మిస్కిన్ తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. చిత్రం బడ్జెట్టు అంతకంతకూ పెరిగిపోతుండడం పట్ల విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడనీ, దాంతో వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిస్కిన్ ఆ ప్రాజక్టు నుంచి తప్పుకోవడంతో మిగిలిన షూటింగును తన దర్శకత్వంలో పూర్తిచేయాలని విశాల్ నిర్ణయించుకున్నాడట.  

More Telugu News