Chandrababu: ఖబడ్దార్​.. ఎవరైనా రౌడీయిజం చేయాలని చూస్తే వాళ్ల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు హెచ్చరిక

Chandrababu prajachaitanya yatra in kuppam
  • కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న చంద్రబాబు
  • రౌడీయిజం చేసే వాళ్లను వదిలిపెట్టం
  • తోక కట్ చేసి  ప్రజల ముందు దోషులుగా నిలబెడతా
ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి రౌడీయిజం చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కుప్పంలో ఆయన మాట్లాడుతూ, రౌడీయిజం చేసే వాళ్లను వదిలిపెట్టమని, తోక కట్ చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.

ఎవరైనా తప్పు చేయాలని, రౌడీయిజం చేయాలని చూస్తే.. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి.. మీ గుండెల్లో ’నిద్రపోతా‘ అని హెచ్చరించారు. వైసీపీ నేతలు కుప్పంలో ఇటీవల నిర్వహించిన సభకు జనాలను తోలుకొచ్చారని, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో ఆ కటౌట్లు ఏర్పాటు చేశారని, ఈ రోజున టీడీపీ ప్రజా చైతన్య యాత్రకు కటౌట్లు ఏర్పాటు చేస్తామంటే వద్దంటారా? అంటూ వైసీపీపై మండిపడ్డారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
kuppam
Praja Chaitanya Yatra

More Telugu News