Ivanka Trump: అందమైన తాజ్ మహల్ ముందు మరింత అందంగా... ఇవాంకా!... ఫొటోలు ఇవిగో!

Ivanka Trump visits Taj Mahal
  • భారత్ లో కుటుంబ సమేతంగా పర్యటిస్తున్న ట్రంప్
  • తండ్రి వెంట భారత్ వచ్చిన ఇవాంకా
  • తాజ్ మహల్ సందర్శించిన వైనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా భారత్ విచ్చేశారు. ఇవాంకా ఈ సాయంత్రం తండ్రితో పాటుగా ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ మహల్ ను సందర్శించారు. తన భర్త జారెడ్ కుష్నర్ తో కలిసి తాజ్ మహల్ వద్ద సందడి చేశారు. ప్రేమైక సౌందర్యానికి నిలువెత్తు చిహ్నం వంటి తాజ్ సౌధం ముందు చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. తాజ్ వద్ద ఇవాంకా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News