India: టి20 వరల్డ్ కప్: ఎదురులేని భారత్ అమ్మాయిలు... బంగ్లాదేశ్ పై ఘనవిజయం

Indian eves registered another win as Bangladesh loses by 18 runs
  • టీమిండియాకు వరుసగా రెండో విజయం
  • 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి
  • మరోసారి స్పిన్ మ్యాజిక్ చేసిన పూనమ్ యాదవ్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 మహిళల వరల్డ్ కప్ లో భారత్ అమ్మాయిల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. పెర్త్ లోని వాకా మైదానంలో బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా మహిళలు 18 పరుగుల తేడాతో నెగ్గారు. భారత్ విసిరిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/18) తన స్పిన్ తంత్రాన్ని ప్రత్యర్థికి రుచిచూపింది. బంగ్లా ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ నిగార్ సుల్తానా సాధించిన 35 పరుగులే టాప్ స్కోర్. ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ 30 పరుగులు చేసింది.
India
Bangladesh
T20 World Cup
Australia
Perth
WACA

More Telugu News