RGV: ట్రంప్ తో జాగ్రత్త... ప్రతీకారం పాళ్లు ఎక్కువ!: వర్మ సరదా వ్యాఖ్యలు

  • ట్రంప్ సభకు కోటి మంది వస్తారంటూ ప్రచారం
  • ట్రంప్ ను జనాల పేరుతో మోదీ మభ్యపెట్టిన విధానం బాగుందన్న వర్మ
  • ట్రంప్ జనాల్ని లెక్కించలేకపోతే మన పంట పండినట్టేనని ట్వీట్
RGV says in a liter way Trump is known to be revengeful

ఆసక్తికర వ్యాఖ్యలతో నెటిజన్లను ఆకర్షించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో వర్మ తనదైన శైలిలో స్పందించారు.

"ట్రంప్ కు జనాల్ని చూస్తే ఊపొస్తుందన్న విషయం తెలుసుకుని ప్రధాని నరేంద్ర మోదీ కోటి మంది ప్రజలు వస్తారని ఆయన్ని మభ్యపెట్టడం బాగుంది. కానీ వచ్చింది కోటి మంది కాదు లక్ష మందే. అసలే ట్రంప్ లో ప్రతీకార ధోరణి మెండుగా ఉంటుంది. తన సభకు జనాలు రాలేదని అలిగి భారత్ తో వాణిజ్య ఒప్పందాలు క్యాన్సిల్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.. అలా జరగదనే ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. అయితే, "ట్రంప్ ఆ స్టేడియంలో జనాల్ని లెక్కించలేక, ఆ లక్ష మందినే కోటి మంది అని భావిస్తే భారత్ పంట పండినట్టే" అంటూ మరో ట్వీట్ చేశారు.

More Telugu News