Donald Trump: తాజ్​ మహల్​ ముందు ఫొటోలు దిగిన ట్రంప్​ దంపతులు

Donalr Triump family visit Tajmahal
  • తాజ్ మహల్ అందాలను వీక్షిస్తున్న ట్రంప్ ఫ్యామిలీ
  • ఈ కట్టడం విశిష్టత గురించి తెలుసుకున్న యూఎస్ అధ్యక్షుడు
  • తాజ్ మహల్ పరిసరాల్లో నడుస్తూ తిరిగిన దంపతులు
ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియాలు సందర్శిస్తున్నారు. ఈ కట్టడం విశిష్టత గురించి ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, తాజ్ మహల్ సందర్శకుల పుస్తకంలో తమ అభిప్రాయాలను ట్రంప్ దంపతులు రాశారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ ముందు, దాని ప్రాంగణంలో మీడియా ఎదుట వారు ఫొటోలకు పోజులిచ్చారు. ట్రంప్ కూతురు ఇవాంక, అల్లుడు జారేద్ కుష్నర్ కూడా తాజ్ మహల్ ను సందర్శిస్తున్నారు. 
Donald Trump
Melania Trump
Tajmahal
Agra

More Telugu News