India: టి20 మహిళల వరల్డ్ కప్: టాస్ గెలిచిన బంగ్లాదేశ్... టీమిండియా బ్యాటింగ్

Bangladesh won the toss as Team India women put into bat
  • ఆస్ట్రేలియాలో మహిళల టి20 వరల్డ్ కప్
  • నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య పోరు
  • జ్వరంతో మ్యాచ్ కు దూరమైన స్మృతి మంధన
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టి20 వరల్డ్ కప్ లో నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ షురూ అయింది. పెర్త్ లోని వాకా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఆసీస్ పై సంచలన విజయం నమోదు చేసిన భారత అమ్మాయిలు ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, స్టార్ ఓపెనర్ స్మృతి మంధన విష జ్వరంతో మ్యాచ్ కు దూరం కావడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్మృతి స్థానంలో రిచా ఘోష్ తుది జట్టులోకి వచ్చింది. ఇక, బంగ్లాదేశ్ జట్టు ఆసియా కప్ లో భారత్ పై నెగ్గామన్న ధీమాతో ఉంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని పునరావృతం చేస్తామని ఆ జట్టు కెప్టెన్ సల్మా ఖాతూన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.
India
Bangladesh
Cricket
T20 World Cup
Women
Australia
Perth

More Telugu News