India: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 806 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • ఖనిజ సంబంధ షేర్లకు 5 శాతం నష్టాలు
  • నష్టాల బాటలో ఆటోమొబైల్ షేర్లు
Stock Markets fell down

భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ట్రంప్ పర్యటన కూడా వాణిజ్యపరంగా ఎలాంటి ఆశావహ వాతావరణాన్ని సృష్టించలేకపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 806 పాయింట్ల నష్టంతో 40,363 వద్ద ముగియగా, నిఫ్టీ 251 పాయింట్ల నష్టంతో 11,829 వద్ద స్థిరపడింది. ఖనిజ సంబంధ షేర్లు 5 శాతం నష్టాలు చవిచూడగా, ఆటోమొబైల్ పరిశ్రమ షేర్లు 3 శాతం నష్టాలు ఎదుర్కొన్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత, మారుతి సుజుకి 4 నుంచి 6 శాతం నష్టపోయాయి.

More Telugu News