Chandrababu: ఇల్లు పీకి పందిరేసే వింత, దుర్మార్గపు ఆలోచనలు మీకెక్కడి నుంచి వస్తాయి?: చంద్రబాబు

Chandrababu slams YS Jagan
  • పేదలకు ప్రభుత్వం తరఫున మంచి చేయాలని హితవు
  • ఒక పేద కోసం మరో పేదవాడి జీవనాధారం తీస్తారా? అంటూ ఆగ్రహం
  • టీడీపీ సర్కారు నిర్మించిన ఇళ్లు పంచాలని డిమాండ్
పేదలకు ఏదైనా చేయాలంటే ప్రభుత్వం తరఫు నుంచి మంచి చేయాలని, కానీ ఒక పేదకు మంచి చేయడానికి మరో పేద జీవనాధారం తీసేయడం సబబు కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. మీ ప్రచారం కోసం తాతల కాలం నాటి నుంచి ఎస్సీ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న భూములను లాక్కుని వాళ్లకు అన్యాయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఇల్లు పీకి పందిరేసే ఇలాంటి వింత ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు మీకెక్కడి నుంచి వస్తున్నాయంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పేదల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు టీడీపీ ప్రభుత్వం నిర్మించిన గృహాలను పేదలకు పంచాలని, సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
Chandrababu
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News