Suman: అలాంటివారినే నేను గొప్ప దర్శకులుగా భావిస్తాను: హీరో సుమన్

Suman
  • యాక్షన్ హీరోగా సుమన్ కి క్రేజ్
  • ఫ్యామిలీ హీరోగాను ఆదరణ  
  • కీలకమైన పాత్రలతో సాగుతున్న కెరియర్  
యాక్షన్ హీరోగా కెరియర్ ను ఆరంభించిన సుమన్, ఆ తరువాత కాలంలో కుటుంబ కథానాయకుడిగా ఎదిగారు. కథానాయకుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన ఆయన, ప్రస్తుతం ప్రాధాన్యత కలిగిన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ''తమ మొదటి సినిమాను కొత్త నటీనటులతో తీసి హిట్ కొట్టిన దర్శకులను నేను గొప్ప దర్శకులుగా భావిస్తాను. ఆల్రెడీ మంచి ఇమేజ్ వున్న ఆర్టిస్టులను పెట్టుకుని తీసిన సినిమాతో విజయాన్ని సాధించడం గొప్ప విషయం కాదు. హిట్ సినిమా రీమేక్ గా కాకుండా .. ఫలానా సినిమా మాదిరిగా వుందే అనిపించకుండా ఆ సినిమా ఉండాలి. అప్పట్లో ఆదుర్తి సుబ్బారావు .. ఆ తరువాత దాసరి నారాయణ రావు .. శేఖర్ కమ్ముల ఇలా వీళ్లంతా కొత్తవాళ్లతో సినిమాలు చేసి విజయాలు సాధించినవారే. అందువలన వాళ్లందరినీ గొప్ప దర్శకులుగా అంగీకరించవలసిందే" అని చెప్పుకొచ్చారు.
Suman
Dasari Narayana Rao
Sekhar Kammula
Tollywood

More Telugu News