పరశురామ్ ను లైన్లో పెట్టిన మహేశ్ బాబు?
- పరశురామ్ కి మహేశ్ గ్రీన్ సిగ్నల్
- ఆలస్యం కానున్న 'నాగేశ్వర రావ్' ప్రాజెక్ట్
- ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఆలోచన
ఈలోగా మహేశ్ .. పరశురామ్ ను లైన్లో పెడుతున్నటుగా సమాచారం. పరశురామ్ ఆల్రెడీ మహేశ్ కి ఒక కథ చెప్పడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. వంశీ పైడిపల్లి సినిమా తరువాత పరశురామ్ తో చేయవలసి వుంది. ఈ కారణంగానే చైతూతో 'నాగేశ్వర రావ్' చేయడానికి పరశురామ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు నుంచి కబురు వచ్చేయడంతో, ముందుగా పరశురామ్ ఆ ప్రాజెక్టునే పట్టాలెక్కించనున్నాడని అంటున్నారు. మహేశ్ తో పరశురామ్ మూవీని మైత్రీవారు నిర్మిస్తారనీ, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.