Venkatesh: ఉత్కంఠకు గురిచేసే 'నారప్ప' ఫైట్స్

  • 'అసురన్' రీమేక్ గా ' నారప్ప'
  • వేగంగా జరుగుతున్న షూటింగ్ 
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ  
Narappa Movie

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందుతోంది. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ విభిన్నమైన లుక్ తో కనిపించనున్నాడు. ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని 'రెడ్ డెసర్ట్'లో జరుగుతోంది.

 పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ ను గురించి పీటర్ హెయిన్స్ మాట్లాడుతూ .."కథను బట్టి ఈ సినిమా యాక్షన్ సీన్స్ ను నేను కొత్తగా డిజైన్ చేశాను. చూసే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. ఇంతవరకూ 27 రోజులుగా ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తూ వస్తున్నాము. మరికొన్ని రోజులు షూటింగ్ జరగవలసి వుంది. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ నాతో పాటు యూనిట్ లోని అందరికీ సంతృప్తిని కలిగించింది. ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పగలను" అన్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News