Donald Trump: ట్రంప్ కోసం రంగంలోకి దిగిన డిఫెన్స్ యాంటీ డ్రోన్లు!

  • నేడు అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన
  • రహదారులన్నీ పోలీసుల అధీనంలోకి
  • భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు
Heavy Security for Trump

యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు పెట్టిన ఆంక్షలు, అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారాయి. ట్రంప్ ప్రయాణించే రహదారులన్నింటినీ, ఈ ఉదయం నుంచే తమ అధీనంలోకి తీసుకున్న 10 వేల మంది పోలీసులు, అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. లక్షలాది మంది ప్రజలు ట్రంప్ కు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసినందున భద్రత పరంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారు.

రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక యాంటీ డ్రోన్లతో నిఘాను పెట్టారు. వీటిని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. ట్రంప్ పర్యటన ముగిసేంత వరకూ ప్రజలు ఎటువంటి డ్రోన్ లనూ ఎగురవేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏడు కంపెనీల క్విక్ రెస్పాన్స్ టీమ్ లు, 15 బాంబు డిటెక్షన్ స్క్వాడ్ లు, పోలీసు జాగిలాలు, ఎస్పీజీ కమాండోలు, ఎయిర్ ఫోర్స్, యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారుల పహారా కొనసాగుతోంది.

More Telugu News