Gold: రాకెట్‌లా దూసుకెళ్తున్న పుత్తడి ధర.. రూ. 45 వేల దిశగా పరుగులు!

  • రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర
  • హైదరాబాద్ మార్కెట్లో రూ. 44,430కి చేరిక
  • గత వారం రోజుల్లోనే రూ.1790 పెరుగుదల
gold rates reaches record high

బంగారం ధర పరుగులు ఆగడం లేదు. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధర ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. హైదరాబాద్ మార్కెట్లో 99.9 (24 కేరెట్) స్వచ్ఛత కలిగిన బంగారం  ధర పది గ్రాములకు రూ.44,430 పలికింది. 99.5 (22 కేరెట్) స్వచ్ఛతతో కూడిన బంగారం ధర రూ. రూ.40,730గా నమోదైంది.

24 కేరెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో గత వారం రోజుల్లోనే రూ. 1790 పెరగడం గమనార్హం. ఈ నెల 17న మార్కెట్లో రూ.42,640 ధర పలకగా నిన్న రూ.44,430కి చేరింది. ఇక 22 కేరెట్ బంగారం ధర రూ.1580 పెరిగింది. కోవిడ్-19 కారణంగా మదుపర్లు బంగారం వైపు మళ్లడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ వంటివి ధర పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News