Donald Trump: ఫ్రెండ్ ను కలిసేందుకు వెళుతున్నా: భారత్ పర్యటనకు బయల్దేరిన ట్రంప్

Donald Trump leaves USA for India visit
  • గాల్లోకి లేచిన అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్
  • రేపు మధ్యాహ్నం భారత్ చేరుకోనున్న ట్రంప్
  • ట్రంప్ రాకకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న భారత్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకకోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ట్రంప్ కొద్దిసేపటి కింద వాషింగ్టన్ నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో భారత్ బయల్దేరారు. విమానం ఎక్కేముందు ఆయన మాట్లాడుతూ, తన ఫ్రెండ్ ను కలిసేందుకు వెళుతున్నానని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకుముందు, వైట్ హౌస్ నుంచి తన భార్య మెలానియాతో కలిసి ఛాపర్ లో ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో పయనమయ్యారు. ట్రంప్ రేపు మధ్యాహ్నం భారత్ చేరుకుంటారు. ముందుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ కు రానున్నారు. కాగా, ట్రంప్ తొలిసారి భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మోదీ సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News