Team India: కుప్పకూలిన భారత టాప్‌ ఆర్డర్‌.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

team india top order out
  • వెల్లింగ్టన్ లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు
  • నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • 19 పరుగులకే కోహ్లీ ఔట్
వెల్లింగ్టన్ లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 348 పరుగులు చేసి, 183 పరుగుల ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించలేకపోతోంది. పృథ్వీ షా 14, మయాంక్‌ అగర్వాల్ 58, పుజారా 11, కోహ్లీ 19 పరుగులకే ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రహానె 13, హనుమ విహారి 9 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 126/4  (53 ఓవర్లకి)గా ఉంది. బౌల్ట్‌ 3 వికెట్లు తీయగా, సౌథీ ఒక వికెట్ పడగొట్టాడు. 
Team India
newzealand
Crime News

More Telugu News