vemulavada: ఆకాశ దేశాన శివరాత్రి రోజున బాలుడి జన్మదిన వేడుకలు

birthday celebrations in helicopter
  • శివరాత్రి రోజున తెలంగాణ పర్యాటక శాఖ  హెలికాప్టర్‌ సేవలు
  • ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ కేక్‌కట్‌ చేసిన బాలుడు అనంత్‌కృష్ణ
  • మర్చిపోలేని జ్ఞాపకమన్న తల్లిదండ్రులు
శివరాత్రి  సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ  ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌ సేవలను వినియోగించుకుని శ్రీసన్నిధి అనంత్‌కృష్ణ అనే  బాలుడు తన పుట్టినరోజును ఆకాశంలో జరుపుకున్నాడు. ఆ హెలికాప్టర్‌లో కూర్చొని ఆకాశంలో కేక్‌ కట్ చేశాడు. అతడి తల్లిదండ్రులు వెంకటకృష్ణతో పాటు కుటుంబ సభ్యులందరూ ఆ సమయంలో అందులోనే ఉన్నారు. వేములవాడ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయం మీదుగా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ కేక్‌ కట్‌ చేసి మురిసిపోయాడు.

ఆకాశంలో తన కుమారుడి పుట్టినరోజు జరపడం మరిచిపోలేని జ్ఞాపకమని అతడి తల్లిదండ్రులు అన్నారు. కాగా, భక్తుల సౌకర్యార్థం శైవక్షేత్రమైన వేములవాడకు శివరాత్రి సందర్భంగా హెలికాప్టర్ సేవలను తెలంగాణ పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో చాలా మంది భక్తులు అందులో వెళ్లారు. ఈ సమయంలోనే అనంత్‌కృష్ణ పుట్టినరోజు ఉండడంతో హెలికాప్టర్‌లో జరుపుకున్నాడు.
vemulavada
Telangana

More Telugu News