Adimulapu Suresh: నూజివీడు ట్రిపుల్​ ఐటీ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేశ్​ సీరియస్​

Ap education minister suresh reacts on Triple IT incident
  • విద్యార్థులను కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత లేదా?
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలి

కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ కళాశాల లేడీస్ హాస్టల్ ఘటనపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత లేదా? అంటూ కళాశాల సిబ్బందిపై మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. త్వరలో ఈ కళాశాలను సందర్శిస్తానని చెప్పారు. కాగా, ఈ నెల 16న ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటపడటంతో ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News