Tamili sye: కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన గవర్నర్​ తమిళి సై దంపతులు

Telangana Governor Tamili sye visits Keesara Gutta
  • మేడ్చల్ మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్ట
  • రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
  • గవర్నర్ దంపతులకు వేదపండితుల ఆశీర్వచనం

మేడ్చల్ మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్ట రామలింగేశ్వరస్వామిని తెలంగాణ గవర్నర్ తమిళి సై దంపతులు దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు వెళ్లిన తమిళి సై దంపతులు ప్రత్యేక పూజలు చేయించారు. కాగా, గవర్నర్ దంపతులకు వేదపండితుల ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.

ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు

వరంగల్ జిల్లా హన్మకొండలో మహా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక హయగ్రీవాచారి మైదానంలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యతిథిగా ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ఓరుగల్లు కళా వైభవం, శివతత్వం చాటి చెప్పేలా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పేరిణి శివతాండవం ప్రదర్శన, తనికెళ్ల భరణి ’ఆట కదరా శివ‘ కీర్తనలను కళాకారులు ఆలపించారు.

  • Loading...

More Telugu News