Chandrababu: మా బీసీ నేతలపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నా: చంద్రబాబునాయుడు

Chandrababu rebukes Ysrcp allegations on TDP BC leaders
  • మా బీసీ నేతలను వైసీపీ లక్ష్యంగా చేసుకోవడం హేయం
  •  అవినీతి బురదలో జగన్ పూర్తిగా కూరుకుపోయారు
  • ఆ బురద మాపై చల్లాలని యత్నిస్తున్నారు
తమ పార్టీకి చెందిన బీసీ నేతలపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ బీసీ నేతలను వైసీపీ లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అచ్చెన్నాయుడు, వాసుపల్లి గణేశ్ లకు ఉన్న ప్రజాదరణ చూసి వైసీపీ ఓర్వలేక వారిపై బురదజల్లుతోందని దుయ్యబట్టారు. బలహీనవర్గాల గొంతు నొక్కేందుకే కౌన్సిల్ రద్దు తీర్మానం చేశారని, బీసీలపై ద్వేషంతోనే ఆదరణ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు. అవినీతి బురదలో జగన్ పూర్తిగా కూరుకుపోయారని, ఆ బురదను టీడీపీ నేతలకు అంటించాలని చూస్తున్నారని, బలహీన వర్గాలపై వైసీపీ దాడిని అందరూ ఖండించాలని కోరారు.
Chandrababu
Atchannaidu
vasupaali Ganesh
Telugudesam
YSRCP

More Telugu News