Vidyasagar Rao: నేను గతంలో జైల్లో ఉన్నానని ఓ వెబ్ సైట్ లో చూసి మా పిల్లలు ఆశ్చర్యపోయారు: విద్యాసాగర్ రావు

BJP leader Vidyasagar Rao makes interesting comments
  • తానేదో కుంభకోణం చేసి జైలుకు వెళ్లినట్టు భావించారని విచారం
  • జైలుకు వెళ్లిన కారణాన్ని వివరించానని వెల్లడి
  • జైల్లో ఉన్నానన్న పదాలను వెబ్ సైట్ నుంచి తీసివేయించానన్న విద్యాసాగర్ రావు
బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బేగంపేట హరితప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాను గతంలో జైల్లో ఉన్నానని ఓ వెబ్ సైట్ లో చూసిన తన పిల్లలు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారని గుర్తుచేసుకున్నారు. తాను ఏదైనా పెద్ద తప్పు చేసి జైల్లో ఉన్నానేమో అనుకున్నారని, తాను ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చిందో వివరంగా చెబితే అప్పుడు సంతృప్తి చెందారని తెలిపారు. ఆ తర్వాత జైల్లో ఉన్నానన్న పదాలను సదరు వెబ్ సైట్ నుంచి తీసివేయించానని వెల్లడించారు.

ఇక, బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తాను పోటీపడడంలేదని స్పష్టం చేశారు. పార్టీ ఏ పని అప్పగించినా కార్యకర్తలా పనిచేస్తున్నానని, తనకు జూనియర్లయిన దత్తాత్రేయ, కిషన్ రెడ్డి నాయకత్వంలోనూ పనిచేశానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వేగంగా పుంజుకుంటోందని అన్నారు.
Vidyasagar Rao
Prison
Website
BJP
Telangana

More Telugu News