India: రాణించిన దీప్తి శర్మ... ఓ మోస్తరు స్కోరు చేసిన టీమిండియా అమ్మాయిలు

India women makes 132 runs against mighty Aussies in T20 world cup opener
  • ఆస్ట్రేలియాతో టి20 వరల్డ్ కప్ మ్యాచ్
  • టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు
మహిళల టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అమ్మాయిలు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేశారు. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను దీప్తి శర్మ (49 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (26) జోడీ ఆదుకుంది.

సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ కు షెఫాలీ వర్మ (29), స్మృతి మంధన (10) జోడీ శుభారంభం అందించింది. అయితే ఆసీస్ బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీసి భారత్ ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే, దీప్తి, జెమీమా సంయమనంతో ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జెస్ జోనాసెన్ కు రెండు వికెట్లు దక్కాయి.
India
Australia
Sydney
T20 World Cup

More Telugu News