Amulya: అమూల్యకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవు: కర్ణాటక సీఎం

  • బెంగళూరులో ఒవైసీ సీఏఏ వ్యతిరేక సభ
  • మైక్ అందుకుని పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేసిన అమూల్య
  • అమూల్యపై దేశద్రోహం కేసు నమోదు
Yeddyurappa says there is no bail chances for Amulya

బెంగళూరులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్న సీఏఏ వ్యతిరేక సభలో అమూల్య లియోన్ అనే యువతి పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దాంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ అంశంపై కర్ణాటక సీఎం యడియూరప్ప స్పందించారు. అమూల్య లియోన్ కు గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ఆమెకు బెయిల్ లభించే అవకాశాలు దాదాపు లేనట్టేనని స్పష్టం చేశారు. అమూల్య వెనుక ఉన్న సంస్థలు ఏమిటో దర్యాప్తుతో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. గట్టి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంస్థలకు అడ్డుకట్టపడదని యడియూరప్ప అభిప్రాయపడ్డారు.

More Telugu News