ఒవైసీ సభలో 'రచ్చ' చేసిన అమ్మాయి అమూల్యపై దేశద్రోహం కేసు.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి చిక్కుల్లో పడ్డ అమ్మాయి
- మండిపడ్డ యడియూరప్ప
- బెయిలు కోసం అమూల్య దరఖాస్తు
- న్యాయమూర్తి నిరాకరణ
సభలో ఆమె చేస్తోన్న వ్యాఖ్యలకు షాక్ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆమె నుంచి మైక్ లాక్కుందామని ప్రయత్నించినా, ఆమె వదలకుండా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయింది. అమూల్యకు బెయిలు ఇవ్వద్దని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. అమూల్య వ్యాఖ్యలపై ఆమె తండ్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. అమూల్యకు నక్సల్స్‌తో సంబంధం ఉందన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు.