Roger Federer: మోకాలికి ఆపరేషన్... నాలుగు నెలలు టెన్నిస్ కి దూరం కానున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్!

Federer didnot play French Open Tennis
  • త్వరలోనే ఫ్రెంచ్ ఓపెన్ పోటీలు
  • ఆపై మరిన్ని డబ్ల్యూటీఏ టోర్నీలు
  • ఆటకు దూరం కానున్న ఫెదరర్
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, నాలుగు నెలల పాటు టెన్నిస్ కు దూరం కానున్నాడు. త్వరలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని రోలాండ్ గారోస్ మట్టి కోర్టుల్లో జరిగే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీల్లోనూ పాల్గొనబోవడం లేదు. అతని కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు, కనీసం నాలుగు నెలలు ఆడరాదని సూచించారు. దీంతో ప్రస్తుతం 38 ఏళ్ల ఫెదరర్‌ కెరీర్ ప్రశ్నార్థకంలో పడినట్లయింది. వచ్చే నాలుగు నెలల్లో ఫ్రెంచ్ ఓపెన్ తో పాటు దుబాయ్‌ ఓపెన్, ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్, బొగోటా ఓపెన్, మయామి ఓపెన్‌ టోర్నీలు జరగనున్నాయి. వీటన్నింటిలో ఫెదరర్ పాల్గొనే అవకాశం లేదు.
Roger Federer
Operation
French Open
Tennis

More Telugu News