Shatrughan Sinha: పాకిస్థాన్‌ వెళ్లి ఎంజాయ్‌ చేసిన శత్రుఘ్న సిన్హా.. వీడియోలు వైరల్.. తీవ్ర విమర్శలు

Shatrughan Sinha attends a wedding in Pakistan
  • లాహోర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరు
  • నవ్వుతూ కనపడ్డ కాంగ్రెస్ నేత
  • జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే పాక్‌ ఎందుకు వెళ్లారని నెటిజన్ల ప్రశ్నలు
కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా పాకిస్థాన్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. లాహోర్‌లో ఆయన ఓ వివాహ వేడుకకు హాజరై, నవ్వుతూ కనపడ్డారు.

ఒకవైపు భారత్, పాకిస్థాన్‌ మధ్య వాతావరణం సరిగ్గా లేదని, మరోవైపు ఆయన శత్రు దేశానికి వెళ్లారని నెటిజన్లు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. 'దేశ సరిహద్దుల వద్ద భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే మన బాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం పాకిస్థానీలతో తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు' అని కామెంట్లు చేస్తున్నారు. శత్రుఘ్న సిన్హాకు పాక్‌లో ఏం పని? అని ప్రశ్నిస్తున్నారు.  



Shatrughan Sinha
Congress

More Telugu News