Donald Trump: 24న తాజ్‌మహల్ వద్దకు ట్రంప్.. అక్కడేమో కోతుల బెడద!

  • 6 నెలలుగా పర్యాటకులను ఇబ్బంది పెడుతున్న కోతులు
  • వస్తువులను లాక్కెళుతోన్న కోతులు
  • ట్రంప్ పర్యటన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు
monkeys at taj mahal

ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అయితే, అక్కడ కోతుల బెడద ఎక్కువగా వుంది. ఆరు నెలలుగా కోతులు పర్యాటకులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తమ చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయంటూ పర్యాటకులు వాపోతున్నారు.

ఈ సమయంలో అక్కడకు ట్రంప్ వెళితే ఆయన పర్యటనకు కూడా కోతులు అంతరాయం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండెంట్ బ్రిజ్ భూషణ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా దీనిపై కూడా దృష్టి పెట్టారు. కోతుల బెడద లేకుండా భద్రతాధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది. కాగా, ఈ నెల 24న ట్రంప్ తాజ్‌మహల్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సందర్శకులను అనుమతించరు.

More Telugu News