prayagraj: ఉత్తరప్రదేశ్‌లో నాలుగు స్టేషన్ల పేర్లను మార్చేసిన రైల్వే.. ఉత్తర్వులు జారీ

Four railway stations name changed in Uttar Pradesh
  • అలహాబాద్ జంక్షన్, సిటీ, ఛివ్‌కీ, ఘాట్ స్టేషన్ల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు
  • ప్రయాగ్‌రాజ్ పురాతన ప్రాభవానికి గుర్తుగానే ..
  • ట్వీట్ చేసిన పీయూష్ గోయల్

ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు రైల్వే స్టేషన్ల పేర్లు మారనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలహాబాద్ రైల్వే జంక్షన్ పేరును ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌గా, అలహాబాద్ సిటీ రైల్వే స్టేషన్‌ పేరును ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ రైల్వే స్టేషన్‌గా, అలహాబాద్ ఛివ్‌కీ రైల్వే స్టేషన్ పేరును ప్రయాగ్‌రాజ్ ఛివ్‌కీ రైల్వే స్టేషన్‌గా, ప్రయాగ్‌రాజ్ ఘాట్ పేరును ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్‌గా పేరు మారుస్తున్నట్టు రైల్వే శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రయాగ్‌రాజ్ పురాతన ప్రాభవానికి గుర్తుగానే స్టేషన్ల పేర్లను మార్చినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News