Nithyananda: నిత్యానందను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించిన కోర్టు

Ramanagara court issues arrest warrant on Nithyananda
  • నిత్యానందపై అరెస్ట్ వారెంట్ జారీ
  • తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా
  • కరీబియన్ దీవుల్లో తలదాచుకుంటున్న నిత్యానంద!
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నిత్యానందను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని రామనగర కోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేశారు. ఓ మహిళపై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిత్యానంద బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టులో చుక్కెదురవడం తెలిసిందే. నిత్యానంద బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా, నిత్యానంద అహ్మదాబాద్ ఆశ్రమం నుంచి కరీబియన్ దీవులకు పారిపోయినట్టు భావిస్తున్నారు. ఈక్వెడార్, హైతీ దేశాల్లో తల దాచుకుంటూ ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Nithyananda
Arrest Warrant
Ramanagara Court
Police

More Telugu News