Mumbai: ముంబైలోని ఫైవ్ స్టార్‌ హోటళ్లకు బాంబు బెదిరింపుల కలకలం

mumbai hotels receive bomb threat
  • లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పేరిట బాంబు బెదిరింపులు
  • ఈ-మెయిల్‌ పంపిన దుండగుడు
  • డబ్బు ఇవ్వాలని డిమాండ్
  • భద్రత పెంచిన అధికారులు
ముంబైలోని 4 ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పేరిట బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. బాంబు దాడులు చేయనున్నట్లు సదరు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు ఓ వ్యక్తి ఈ-మెయిల్స్‌ ద్వారా పేర్కొన్నాడు. తాము ఈ దాడులకు పాల్పడకుండా ఉండాలంటే వెంటనే బిట్‌కాయిన్ల రూపంలో తమకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. హోటల్‌ లీలా, హోటల్‌ ప్రిన్సెస్‌, హోటల్‌ పార్క్‌, హోటల్‌ రమదా ఇన్‌లకు ఈ-మెయిల్స్ అందాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలిపారు. అయితే, ముందు జాగ్రత్తలో భాగంగా బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బందిని ఆయా హోటళ్ల వద్ద ఉంచి, భద్రతను పెంచారు. యాంటీ టెర్రరిస్ట్‌ టీమ్‌తో పాటు క్రైం బ్రాంచ్‌ అధికారులు విచారణ ప్రారంభించారు.
Mumbai
Maharashtra

More Telugu News