Sai Pallavi: తెలంగాణ పోలీసులు చాలా గ్రేట్: సాయిపల్లవి

Sai Pallavi praises TS Police
  • మహిళల రక్షణ కోసం టీఎస్ పోలీసులు ఎంతో చేస్తున్నారు
  • హైదరాబాదులో ఉన్నంత భద్రత మరెక్కడా లేదు
  • పోలీసులకు యువత కూడా సహకరించాలి

తెలంగాణ పోలీసులపై సినీ నటి సాయిపల్లవి ప్రశంసలు కురిపించింది. మహిళల రక్షణ కోసం టీఎస్ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు చాలా గ్రేట్ అని కితాబిచ్చింది. మన దేశంలో మహిళలకు హైదరాబాదులో ఉన్నంత భద్రత మరెక్కడా లేదని తెలిపింది. గతంలో చదువు, ఉద్యోగాల కోసం వచ్చే యువతులు చాలా భయపడేవారని... ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని చెప్పింది. పోలీసులకు కూడా యువత సహకరించాలని... అది మన బాధ్యత అని తెలిపింది. హెచ్ఐసీసీలో షీ ఎంపవర్ ఉమెన్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News