Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ, పూరీ సినిమా స్టిల్స్‌ వైరల్‌.. హీరోయిన్‌గా అనన్య పాండే

  • విజయ్ దేవరకొండ  హీరోగా ‘ఫైటర్’
  • పాన్‌ ఇండియా మూవీ
  • జాన్వి కపూర్‌ని తీసుకోవాలని అనుకున్న చిత్ర బృందం
ananyapandayy is on board for Pan India venture with Deverakonda

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ‘ఫైటర్’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జొహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
          
 ఈ పాన్‌ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటిని తీసుకున్నారు. ఈ సినిమాలో ముందు జాన్వి కపూర్‌ని తీసుకోవాలని అనుకున్న విషయం తెలిసిందే. చివరకు బాలీవుడ్ హీరోయిన్‌ అనన్య పాండే ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు ఆ సినిమా బృందం ప్రకటించింది. ఆమె బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె. ఆమెకు స్వాగతం పలుకుతూ ఛార్మీ ట్వీట్ చేసింది.
                       

More Telugu News