Vijay Sai Reddy: 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది: విజయసాయిరెడ్డి

vijaya sai reddy mocks chandrababu naidu
  • గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలంటున్నారు
  • కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా?
  • అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన చెబుతున్న మాటలకు ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోవడంతో చప్పట్లు కొట్టాలంటూ అడుగుతున్నారని చురకలంటించారు.

'గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది. కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా. చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకో చోటుకి బయలుదేరుతున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News