Gold: ఆల్ టైమ్ రికార్డును దాటేసిన బంగారం ధర!

Gold Rates High
  • కరోనా భయాలతో స్టాక్ మార్కెట్ డీలా
  • బులియన్ మార్కెట్ వైపు ఇన్వెస్టర్ల పరుగులు
  • కొన్ని చోట్ల రూ. 43 వేలు దాటిన ధర
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కరోనా వైరస్ భయాల కారణంగా స్టాక్ మార్కెట్లు డీలా పడిన వేళ, తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ అత్యధిక రాబడులను ఇస్తుందని మదుపరులు అంచనా వేస్తుండటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా కావడం, కొనుగోళ్లు జోరుగా సాగుతూ ఉండటంతో, ఇండియాలో ధర ఆకాశానికి ఎగబాకుతోంది.

ప్రస్తుతం భారత్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 42,462కు (న్యూఢిల్లీ) చేరింది. మంగళవారం నాటితో పోలిస్తే, బుధవారం ఒక్కరోజే ధర రూ. 468 పెరిగింది. వెండి ధర కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. 48,652కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో బంగారం ధర రూ. 43 వేలను కూడా దాటేసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పడం గమనార్హం.
Gold
Price
Corona Virus
Hike

More Telugu News