Actress Leelavathi: అలనాటి కన్నడ నటి లీలావతి తోటలో అగ్ని ప్రమాదం.. విచారణ జరిపించాలన్న వర్ధమాన నటుడు వినోద్

Fire at Leelavathis farm house
  • దెబ్బ తిన్న టేకు, ఇతర వ్యవసాయోత్పత్తులు
  • ఏడాది కాలంలో జరిగిన మూడో ఘటన
  • పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదన్న లీలావతి
కర్ణాటకకు చెందిన అలనాటి నటి లీలావతికి చెందిన తోటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టేకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

 కాగా, ఏడాది కాలంలో జరిగిన మూడో ప్రమాదం ఇదని లీలావతి తెలిపారు. నెలమంగల తాలూకాలోని సోలదేవనహల్లిలో ఉన్న ఈ తోటకు సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లీలావతి కుమారుడు, వర్ధమాన నటుడు వినోద్ ఆరోపించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కొందరు వ్యక్తులు పలు రకాల సమస్యలను సృష్టించి తమను వేధిస్తున్నారంటూ లీలావతి ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. అంతలోనే ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Actress Leelavathi
Karnataka
Fire Accident

More Telugu News