NABARD: గుంటూరు జిల్లా వాసికి అరుదైన గౌరవం.. నాబార్డు చైర్మన్‌గా చింతల గోవిందరాజులు

Chintala Govindarajulu to be appointed as chairman of NABARD
  • చైర్మన్ పోస్టుకు గోవిందరాజులు పేరును సిఫారసు చేసిన బ్యాంక్ బోర్డు
  • 24 ఏళ్ల తర్వాత తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
  • 1985లో నాబార్డ్‌లో గ్రేడ్-బి అధికారిగా చేరిక
గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన చింతల గోవిందరాజులు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) చైర్మన్‌గా నియమితులు కానున్నారు. ఈ పదవికి గోవిందరాజులు పేరును సిఫారసు చేస్తూ బ్యాంక్స్ బోర్డు బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టు కోసం మొత్తం 18 మంది పేర్లను పరిగణనలోకి తీసుకున్న బోర్డు.. చివరికి గోవిందరాజుల పేరును ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

నాబార్డ్ చైర్మన్‌గా ఓ తెలుగు వ్యక్తికి అవకాశం దక్కడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో కోటయ్య చైర్మన్‌గా వ్యవహరించారు. 1985లో నాబార్డ్‌లో గ్రేడ్-బి అధికారిగా చేరిన గోవిందరాజులు  ప్రస్తుతం నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. లక్నోలోని బీఐఆర్‌డీ డైరెక్టర్‌గా, న్యాబ్‌ఫిన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ సేవలు అందించారు.
NABARD
Guntur District
Chintala Govindarajulu

More Telugu News