Andhra Pradesh: సాక్షి మీడియాపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు టీడీపీ ఫిర్యాదు

TDP complaint Editors guild and press council against Sakshi Media
  • ఐటీ దాడులను చంద్రబాబుకు ఆపాదించారు
  • వార్తలను వక్రీకరించి ప్రచురించారు
  • ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు వీడియో సీడీలు, వార్తల క్లిప్పింగులు పంపిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఐటీ దాడుల వార్తలను వక్రీకరించి రాశారంటూ సాక్షి మీడియాపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఐటీ దాడుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధం లేని విషయాలను ఆపాదిస్తూ వార్తలు ప్రచురించారని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నైతిక విలువలు, జర్నలిజం ప్రమాణాలను దిగజారుస్తున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని అందులో డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరాధారమైన వార్తల క్లిప్పింగులు, వీడియో సీడీలను ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్‌కు పంపారు.
Andhra Pradesh
IT Raids
Chandrababu
Telugudesam
sakshi media

More Telugu News