Sajjala Ramakrihna Reddy: సీఏఏ, ఎన్నార్సీ విషయంలో ఆందోళన చెందొద్దు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల

Minister Sajjala comments on CAA and NRC
  • సీఏఏకు మద్దతు తెలిపినప్పుడు ఎన్పీఆర్, ఎన్నార్సీ లేవు
  • తమ వైఖరి ఏమిటో అప్పట్లోనే స్పష్టం చేశాం
  • ముస్లింలకు వైసీపీ అండగా ఉంటుంది

పార్లమెంటులో సీఏఏకి వైసీపీ మద్దతు తెలిపిన సమయంలో ఎన్పీఆర్, ఎన్నార్సీలు లేవని... ఆ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు తమ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అక్రమ వలసలు, చొరబాట్లు, దేశ భద్రత అంశాల కారణంగానే సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు పలికిందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నార్సీ అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు.

ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వారికి వైసీపీ అండగా ఉంటుందని సజ్జల భరోసా ఇచ్చారు. సీఏఏ, ఎన్నార్సీల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని... వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని చెప్పారు.

  • Loading...

More Telugu News