CM Jagan: మరి చంద్రబాబుపై మీ కడుపు మంట అదేగా!: ఏపీ సీఎంకు నారా లోకేశ్ కౌంటర్

Nara Lokes counter on ap cm jagan speech
  • ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తిచేయరాదని కంకణం కట్టుకున్నారు
  • అందుకే ఆ దిశగా మోకాలడ్డుతున్నారు
  • మీ కడుపు మంటకూ మందు లేదు
‘నా పనితీరు చూసి ఈర్ష్యతో రగిలిపోతున్న విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కడుపు మంటకు మందు లేదు’ అన్న ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీటైన సమాధానం ఇచ్చారు. ‘నవ్యాంధ్రను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఐదేళ్లపాటు చంద్రబాబు ప్రారంభించిన పలు ప్రాజెక్టులు పూర్తికాకూడదన్న ధోరణితో పనిచేస్తున్న మీ కడుపు మంటకూ మందు లేదు’ అంటూ ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.

నిన్న కర్నూలులో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ మూడో విడత కార్యక్రమం ప్రారంభోత్సవంలో చంద్రబాబుపై జగన్‌ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రజల కోసం నేను నిజాయతీగా ఎన్ని మంచి పనులు చేసినా చంద్రబాబుకు విమర్శించడం తప్ప మరో పనిలేదని జగన్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు లోకేశ్ ట్విట్టర్‌ వేదికగా సమాధానమిచ్చారు.
CM Jagan
Nara Lokesh
Kurnool District
Twitter

More Telugu News