Vijay Sai Reddy: కాలం చెల్లిన యనమల ఎత్తుగడలను గుడ్డిగా నమ్మిన బాబు..!: విజయసాయిరెడ్డి
- బాబు కౌన్సిల్ నే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట
- రద్దు అనేది లాంఛనమే అని వాళ్లకి అర్థమైంది
- జీతభత్యాలు చెల్లిస్తానన్న హామీని బాబు నిలబెట్టుకోవాలంటున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. యనమల వల్ల శాసన మండలినే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు.
'కాలం చెల్లిన యనమల ఎత్తుగడలను గుడ్డిగా నమ్మిన బాబు కౌన్సిల్ నే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట. రద్దు అనేది లాంఛనమే అని వాళ్లకి అర్థమైంది. కౌన్సిల్ పోతే మిగిలిన పదవీ కాలం జీతభత్యాలు చెల్లిస్తానన్న హామీని బాబు నిలబెట్టుకోవాలని డిమాండు చేస్తున్నారట' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.