Rana: త్వరలోనే సెట్స్ పైకి 'హిరణ్యకశిప'

  • ఏప్రిల్ 2వ తేదీన 'హాథీ మేరే సాథీ' విడుదల 
  • త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న 'విరాటపర్వం'
  • ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న 'హిరణ్యకశిప'  
Hiranya Kashipa Movie

రానా కథానాయకుడిగా ఆయన కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఒక భారీ పౌరాణిక చిత్రం రూపొందనుంది .. అదే 'హిరణ్యకశిప. సురేశ్ ప్రొడక్షన్స్ వారు 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. అనుకోకుండా జరిగే ఖర్చుల నిమిత్తం మరో 20 కోట్లు పక్కకి పెట్టారట. అంటే 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది.

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దర్శకుడు గుణశేఖర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ వేసవిలో పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. రానా చేసిన 'హాథీ మేరే సాథీ' ఏప్రిల్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ వెంటనే ఆయన 'విరాటపర్వం' షూటింగును కూడా పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత ఆయన 'హిరణ్యకశిప' కోసం రంగంలోకి దిగనున్నట్టు చెబుతున్నారు.

More Telugu News